రాధాకృష్ణ మూర్తి కి సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం

Spread the love

రాధాకృష్ణ మూర్తి కి సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కు సామాజిక సేవలకు మరియు రైతు శ్రేయోభిలాషి గుర్తింపుతో ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. శనివారం ఢిల్లీ లోని డాక్టర్ బిఅర్ అంబేద్కర్ ఆడిటోరియం ఆంధ్రప్రదేశ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో దీరావతు రాధాకృష్ణ మూర్తి డాక్టరేట్ సత్కరంను స్వీకరించారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఫౌండర్ పి మనుయేల్ కె సంపత్ కుమార్ మాజీ సోషల్ కమిషనర్ అండ్ ప్రిసిపల్ సెక్రెటరీ తమిళనాడు
ఈ అవార్డు అందించారు. ధీరావతు రాధాకృష్ణ మూర్తి ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ భవిశ్యత్ లో సామాజిక సేవ కార్యక్రమాలలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు.తను చేసిన సామాజిక సేవలను గుర్తించి తనకు డాక్టరేట్ ను అందించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ ప్రతినిధులకు ధన్యవాదాములు తెలిపినారు. ధీరావతు రాధాకృష్ణ మూర్తి జిల్లాలో హ్యూమన్ రైట్స్ ప్రసిడెంట్ గ మరియు అలానే మండల గిరిజన ప్రసిడెంట్ గ పనిచేస్తున్నారు.చదివిన చదువు సంభదం లేకుండా వ్యాపారం చేస్తూ మంచి పేరు ను సంపాదించారు.కరోనా కాలంలో తనవంతు సహాయంగా ప్రజలను ఆదుకున్నారు.

Related Posts

You cannot copy content of this page