బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక

Spread the love

బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులుగా గ్యార శేఖర్ ఎన్నిక

చిట్యాల సాక్షిత ప్రతినిధి

బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) చిట్యాల మండల పార్టీ అధ్యక్షులుగా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గ్యార శేఖర్ ఎన్నికైనట్లు బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ తెలిపారు. శనివారం గద్దపాటి రమేష్ మాట్లాడుతూ గత కొంతకాలం నుండి చిట్యాల మండలలో పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోని పార్టీ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్ననందున ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం నూతన బిఎస్పీ మండల అధ్యక్షులు గ్యార శేఖర్ మాట్లాడుతు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని బిసి, ఎస్సి, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ లందరిని కలుపుకొని బహుజనులకు రాజ్యాధికారమే లక్షంగా పనిచేస్తానన్నారు. నాపై నమ్మకంతో నన్ను నియమించిన జిల్లా, నియోజకవర్గ ఇంఛార్జి, నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page