చింతబావిలో సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు
సాక్షిత సికింద్రాబాద్ : కలుషిత నీటి సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చింత బావి ప్రాంతంలో ఇటీవల కలుషిత నీటి సరఫరా సమస్యలు వెలుగు చూసిన నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జలమండలి ఎం డీ, ఇతర అధికారులను సంప్రదించి దాదాపు కోటి రూపాయల మేరకు నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నేపద్యంలో రూ. 20 లక్షలతో చింత బావి లో సివరేజ్ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ ఆర్. సునీత, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి ఇబ్బందులను పూర్తిగా నివారించ గలిగామని, సివరేజ్ సమస్యలను కుడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంచి నీటి సరఫరాలో కలుషిత సరఫరా సమస్యల పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని అయన పేర్కొన్నారు. జలమండలి సీ జీ ఏం ప్రభు, డీ జీ ఏం సరిత, మేనేజర్ నిఖిత, యువ నేత కిషోర్ కుమార్ గౌడ్ లతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు.