నకిరేకల్ సాక్షిత ప్రతినిధి
పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ క్షేత్రంలో వేరుశెనగ సాగు తీస్తున్న మహిళలను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. పంట సాగు, పెట్టుబడి, లాభార్జనపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని, రైతన్నలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సీఎం కేసీఆర్ సమకూర్చు తున్నారని అన్నారు. పంట మార్పిడి జరిగితేనే లాభదాయకంగా ఉంటుందని, పంట మార్పిడి చేసేలా రైతులు సంఘటితం కావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, నార్కట్ పల్లి ఎంపిపి సూదిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు.