పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి – సర్పంచులు
— కార్యదర్శుల సమ్మెకు సర్పంచుల ఆర్థిక సాయం
చిట్యాల సాక్షిత ప్రతినిధి
నాలుగు సంవత్సరాలు ప్రోబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన సమ్మె ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని తమ 5వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని న్యాయబద్ధ మైనటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యదర్శుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించి తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శుల కృషి ఎనలేనిదని, కరోనా విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహించి రేషన్ బియ్యం, పెన్షన్ పంపిణీ, హెల్త్ సర్వే, కరోనా టీకా మొదలైన కార్యక్రమాలను నిర్వహించిన ఘనత పంచాయితీ కార్యదర్శుల దేనని, అనుక్షణం మాకు తోడుగా వెన్నంటి ఉంటూ హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, గ్రామీణ క్రీడా ప్రాంగణం, నర్సరీ, వీధిలైట్లు, పారిశుధ్యం, డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేయడం, వీధులను శుభ్రం చేయడం ఇలా ఎన్నో ప్రగతి పూర్వక చర్యల్ని కార్యదర్శులు చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తాల్ల వెల్లెంల సర్పంచ్ జనగాం రవీందర్, బోయగుబ్బ సర్పంచ్ కంచర్ల సునీత వెంకట్ రెడ్డి, వట్టిమర్తి సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, వెంబావి సర్పంచ్ అద్దెల నర్సిరెడ్డి, బొంగోనిచెర్వు సర్పంచ్ సామిడి మోహన్ రెడ్డి,వెలిమినేడు ఎంపీటీసీ దేశబోయిన స్వరూప, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు