కార్మిక పక్షపాతి కేసీఆర్

Spread the love

కార్మిక పక్షపాతి కేసీఆర్

కార్మికుల కష్టాలెరిగిన మహానీయుడు కేసీఆర్

పారిశుద్ధ్య కార్మికులకు వరాల జల్లు

సఫాయి కార్మికుల త్యాగాలకు గుర్తింపు

సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ధన్యవాదాలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మేడే కానుకగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతిగా మారారని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 వంతున పెంచడం పట్ల ఎంపీ నామ హర్షం వ్యక్తం చేసి, సీఎం కేసీఆర్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. పెంచిన జీతాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వడం కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, దార్శనికతకు నిదర్శనమన్నారు. కార్మికుల కష్టాలు ఎరిగిన మహనీయుడు కేసీఆర్ అని నామ పేర్కొన్నారు.
జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని నామ తెలిపారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు వారి శ్రమను గుర్తించారని నామ నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని నామ నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వారి కృషి దాగి ఉన్నదన్నారు.
పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని, కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని నామ నాగేశ్వరరావు అన్నారు.

Related Posts

You cannot copy content of this page