SAKSHITHA NEWS

సాక్షిత : మంత్రి అజయ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్
పువ్వాడ స్వీయ పర్యవేక్షణలో విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం
ఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా విగ్రహ ఆవిష్కరణ మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఒక్కసారైనా వచ్చి ఆయన విగ్రహాన్ని దర్శించుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయిందని విగ్రహ తరలింపుకు రంగం సిద్ధం చేశామని మే 28న పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు.

రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు.

WhatsApp Image 2023 04 21 at 1.20.49 PM

SAKSHITHA NEWS