పల్లా కిరణ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా మరియు అన్ని కులల , మతల నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు మరియు చీరలు పంపిణీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం నగరంలో పల్లా కిరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్ని కులల , మతల నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు , చీరలు మరియు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా లను పంపిణీ చేశారు. తన తండ్రి పల్లా జాన్ రాములు అడుగుజాడల్లో నడుస్తూ నలుగురికి సహాయం చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ తన తండ్రి ఆశయ సాధనకే కృషి చేస్తున్నాడు అని తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలను ఇంతమంది ప్రజల ముందు చేసుకోవడం చాలా ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పుడూ చెప్తుండేవారని జీవితంలో నలుగురికి ఉపయోగపడుతూ వారి మన్నెలను పొందినప్పుడే జీవితానికి సాదికారత లభిస్తుందని అలాగే ఈ రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని కులల , నిరుపేద మహిళలకు సుమారుగా 250 మందికి పంపిణీ చేశారు. భగవంతుని దయా కృపతో ఎవరి దగ్గర
నుండి రూపాయి ఆశించకుండా తన సొంత నిధులతో గత 15 సంవత్సరాల నుండి విద్యా , వైద్య పలు రూపంలో సేవా కార్యక్రమాలు చేపట్టారని అలాగే అలాగే కరోనా టైం లో కూడా ఎంతో మందికి సహాయం అందించారని అన్నారు.