SPS నెల్లూరు జిల్లా:
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఎర్రగుంటలోని కమ్యూనిటీ హాల్లో పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన వై.యస్.ఆర్. ఆసరా 3వ విడతా సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రికాకాణి గోవర్ధన్ రెడ్డి .
సాక్షిత : మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలికిన పొదుపు సంఘబంధాల మహిళలు.
ప్రభుత్వ సబ్సిడీతో మహిళలకు అందజేయనున్న వివిధ పథకాలకు చెందిన స్టాల్స్ ను సందర్శించిన మంత్రి కాకాణి.
కార్యక్రమంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎన్నికల ముందు స్పష్టమైన మాటిచ్చి, నేడు వై.యస్.ఆర్.ఆసరా ద్వారా 4విడతల్లో మహిళల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు రుణమాఫీ చేస్తానంటూ, అధికారంలోకి వచ్చి, రుణమాఫీ చేయకుండా, వెళ్ళిపోయాడు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, మాట తప్పని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి .
అన్ని సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను ఇస్తున్నారు.
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది.
జగన్మోహన్ రెడ్డి , మహిళలు ఆర్థికంగా నెలదొక్కుకోవాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు
వెంకటాచలం మండలంలోని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో 3 విడతల్లో 18కోట్ల 79 లక్షల రూపాయలు నేరుగా జమ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మహిళలకు 75 పైసలు వడ్డీకే రుణాలు అందిస్తున్న బ్యాంకుల్లో మొదటివి మన కోఆపరేటివ్ బ్యాంకులు.
మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మహిళలు ఆశీస్సులు అందించండి.