కృష్ణాజిల్ల, మచిలీపట్నం…
రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్.
విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఈప్రాంతంలో ప్రమాదాల బారిన పడి గాయలపాలవుతున్నా పోలీసులు నివారణా చర్యలు చేపట్టకపోవడం విచారకరం.
ఈప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయడం కన్నా వేగనిరోధక బారికేడ్లను ఏర్పాటు చేయడమే ఉత్తమమని భావిస్తున్న స్థానికులు.
నిన్న రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు గేదెను డీ కొనడంతో కాళ్లు విరిగిపోయిన గేదె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది.
కారణాలు ఏమైనప్పటికీ రాత్రి మూడు గంటల నుండి గాయాలతో అల్లాడుతున్న మూగజీవానికి వీలైనంత త్వరగా ప్రథమ చికిత్స అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.