గుంటూరు ఛానల్ పొడిగింపునకు తక్షణమే నిధులు విడుదల చేయాలి.. లేదంటే రైతు సంఘాలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేయవలసి ఉంటుంది: గాదె
ప్రత్తిపాడు నియోజకవర్గం లో “నల్లమడ రైతు సంఘం” ఆధ్వర్యంలో గుంటూరు చానల్ పొడిగింపునకు నిధులు కేటాయించాలని పెదనందిపాడు మండలంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల నుంచి రైతులు పోరాడుతున్న గాని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం హెయమైన చర్య అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచి అనేకమంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి ఎన్నికయ్యారు. వారంతా ఎప్పటికప్పుడు రైతులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని సమస్యను ఎప్పటికప్పుడు నీరుగారిస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రజలు ఆలోచించి సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని అన్నారు. అలాగే గుంటూరు చానల్ పొడిగింపునకు తక్షణం నిధులు మంజూరు చేయనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శోభనాద్రి గారు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు , ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్ , కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు గారు, మండల అధ్యక్షులు కొల్లా గోపి, పత్తి భవన్నారాయణ, గడ్డం శ్రీనివాసరావు, సుధా పిచ్చయ్య, శిరసాని వెంకట్రావు, నెల్లూరు రాజేష్, గోపిశెట్టి సాయి మండల నాయకులు కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.