టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా వైసీపీనేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అతని అనుచరులు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అతని అనుచరులకు పసుపుకండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత.
కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం:-
23ఓట్లతో 23వతేదీన, 2023లో టీడీపీ ఎమ్మెల్సీఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్క్రిప్ట్. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు.
“వైసీపీ సేవాదళ్ రాష్ట్రఅధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని న మ్మి పార్టీలోచేరారు. వారితో పాటు కోవూరు, గూడూరు, నెల్లూరురూరల్, నెల్లూరుసిటీ ని యోజకవర్గాల వైసీపీనేతలు, కొన్నివందలమంది వైసీపీకి రాజీనామాలు చేసి, నేడు పసుపు కండువాలు కప్పుకున్నారు. అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చేఎన్నిక ల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుంది. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల ఇంకా పార్టీ బలం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారు? జగన్ నమ్మినవారిని నట్టేట ముంచే రకం.
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మళ్లీ గెలవడు. గిరిధర్ రెడ్డిలాంటి వారే ఆపార్టీలో ఉం డలేకపోయారంటే, ఇంకఎవరూ దానిలోఉండరు. నమ్ముకున్నవారిని నట్టేటముంచే వాడు నాయకుడు కాలేడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. జగన్ నియోజ కవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. సైకోపోవాలి… సైకిల్ రావాలనే నినాదం మారుమోగుతోంది. సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. మొన్న చదువుకున్న వాళ్లు తమపార్టీకి ఓటేయలేదని అన్నాడు. మరినిన్న సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదు.
23మంది ఎమ్మెల్యేలు టీడీపీకి రావడాన్ని దేవుడి స్క్రిప్ట్ అని జగన్ఎద్దేవాచేశాడు. నిన్న 23వ తేదీన, 23ఓట్లతో, 2023లో టీడీపీఅభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడం కూడా దేవు డి స్క్రిప్టే. దేవుడు స్క్రిప్ట్. తిరగరాశాడు. ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఫలితాలుచూశాక, జగన్ కు నిద్రపట్టడంలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగులుతున్నాయని చెప్పుకుంటున్నారు. జగన్ అధికారం ఉందని విర్ర వీగాడు. అహంకారంతో ప్రవర్తించాడు. ఇప్పుడు జగన్ పని గాలితీసిన బెలూన్ లా అయ్యింది . అధికారంలో ఉన్నవారు హుందాగా, గౌరవంగా ఉండాలి. ప్రజలకు మేలుచేయాలి. అబద్ధాలు, అసత్యాలతో పబ్బంగడుపుకునే ప్రయత్నంచేశారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక తొలిరోజు అసెంబ్లీలో మాట్లాడిన జగన్, వేరేపార్టీ నుంచి ఎవరైనా మరోపార్టీలో చేరి తో ఆటోమేటిగ్గా వారు డిస్ క్వాలిఫై అయ్యేలా చేయాలన్నాడు. అదేవ్యక్తి టీడీపీనుంచి 4గు రు ఎమ్మెల్యేలని తీసుకున్నాడు. ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీఎన్నికల్లో పోటీకి టీడీపీకి అర్హతే లేదన్నారు. మరి ఇప్పుడు 23ఓట్లతో టీడీపీ గెలిచింది.
రాష్ట్రం జగన్ చేతిలో ఉండటం నిజంగా ప్రజల దౌర్భాగ్యం. 40ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నాను. ఇన్నేళ్లలో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలున్నటికీ మర్చిపోలేను. జగన్ సైకో. పిచ్చోడిచేతిలో రాయిలా అతని పాలనఉంది. రాష్ట్రం అత నిచేతిలో ఉండటం నిజంగా దౌర్భాగ్యమే. సాగునీటి ప్రాజెక్ట్ ల్ని పండబెట్టారు. రోడ్లనిర్మాణా న్ని గాలికివదిలేశారు. రాష్ట్రంలో అభివృద్ధిఅనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అమరావతి, పోలవరాన్ని సర్వనాశనంచేశాడు. సంక్షేమకార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రజలకు ప్రశాంతతలేదు. ఎవరూ నిద్రపోయే పరిస్థితికూడా లేదు. రాష్ట్రభవిష్యత్ ను జగన్ అంధకారం చేశాడు. వైసీపీఎమ్మెల్యేలు ఎలాగైతే టీడీపీకిఓటేశారో, అలానే వైసీపీనేతలు, కార్యకర్తలు కూడా రాష్ట్రంకోసం టీడీపీపక్షాన నిలవాలి. బెదిరించి, ప్రలోభపెట్టి చేసేది రాజకీ యంకాదు…అది రౌడీయిజం.. టెర్రరిజం…సైకోయిజం. పట్టభద్రులు ప్రభుత్వంపై తిరుగుబాటుచేశారు.. వైసీపీఎమ్మెల్యేలు జగన్ పై తిరగబడ్డారు. ఇప్పుడు వీచిందిచిన్నగాలే.. భవిష్యత్ లో టీడీపీసునామీదెబ్బకు వైసీపీ కొట్టుకుపోతుంది
ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పట్టభద్రులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వైసీపీఎమ్మెల్యేలు జగన్ పైతిరగబడ్డారు. రాష్ట్రంలో మరోపక్క ప్రజలపై బాదుడేబాదుడు. ప్రజలపై పన్నులభారం…ఛార్జీల మోతలు. నిన్నటికి నిన్న చెత్తపన్నుపెంచారు. ఆస్తిప న్నులో కలిపి వసూలుచేయమంటున్నారు. పేదలు బతకలేని పరిస్థితివచ్చింది. ఎవరూ చేయనన్ని తప్పులు సైకో జగన్ చేశాడు. మాట్లాడితేకేసులు.. పోలీసులు రాత్రిళ్లు గోడలు దూకి ఇళ్లలోకి వస్తారు. చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులుందరి భరతంపడతాం. కొందరు పోలీస్ అధికారులు హద్దులుమీరి ప్రవర్తిస్తున్నారు. సైకోచెప్పిందిచేస్తే తమకు కూడా బాగుం టుందని అనుకుంటున్నారు. అలాంటి వారిపేర్లు, వారిచిట్టాలు మొత్తం రెడీచేశాం. రఘురా మిరెడ్డి అనే డీఐజీ కూడా బుద్ధిచెబుతాం. ఉగాదికానుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం. ఇప్పుడు వీచింది చిన్నగాలి మాత్రమే. భవిష్యత్ లో వచ్చేదిసునామీనే. టీడీపీ సునామీ దెబ్బకు వైసీపీకొట్టుకుపోవడం ఖాయం.
గిరిధర్ రెడ్డి యువకుడు.. ఉత్సాహవంతుడు. ప్రజలకుసేవచేయాలని తపనపడేవాడు. అ లాంటి వ్యక్తిని వైసీపీ వద్దనుకుంది. తెలుగుదేశంపార్టీలోకి వచ్చిన ప్రతిఒక్కరికీ మరోసారి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. బాణసంచా కాలుస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించాను.
కార్యకర్తలు ఉత్సాహంతో బాణసంచాకాలిస్తే, నలుగురుకి గాయాలయ్యాయి. బాణసంచా కాలి గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. వైద్యులతో మాట్లాడి, వారికి మెరుగై న చికిత్సఅందించాలని కోరాను. మనకోసం వచ్చినవారికి అలాజరగడం నిజంగా చాలా బాధ గా ఉంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.
వచ్చేఎన్నికల్లో నెల్లూరుజిల్లాలోని 10స్థానాలు టీడీపీ గెలుస్తుంది : కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
“తెలుగుదేశం కుటుంబంలో నన్నుభాగస్వామినిచేసిన చంద్రబాబుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలాఅవసరం. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టీడీపీలో చేరాను. నెల్లూరుజిల్లాలోని 10 అసెంబ్లీస్థానాలను వచ్చేఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది. మాతోపాటు మ మ్మల్ని నమ్ముకొని తెలుగుదేశంపార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు.