కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – 11 వేల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. బౌద్దనగర్ డివిజన్ లోని ఎస్ ఆర్ వీ ఆసుపత్రిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ .. జూన్ 30 తేది వరకు కంటి వెలుగు కొనసాగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన బృందాలు ఇంటింటికీ తిరిగి ఆయా కేంద్రాల సమాచారం అందిస్తున్నాయని తెలిపారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 8 సెంటర్స్ ఏర్పాటు చేసి, కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని పెంచుతామని తెలిపారు. ప్రస్త్రుతం వరకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ౩౩,398 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, 11 వేల మందికి కంటి అద్దాలను అందించామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కనీసం 2.94 లక్షల మందికి ఉచితంగా పరిక్షలు నిర్వహించాలని లక్షంగా నిర్ధారించుకున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఎలిజిబెత్, కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ, ఎస్ ఆర్ వీ ఆసుపత్రి ట్రస్ట్ ఛైర్మన్ సుంకు రామచందర్, బీ ఆర్ ఎస్ నేత కంది నారాయణతో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.