SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రం లో ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా షేక్ మహమ్మద్ రఫీ అందిస్తున్న సేవలు చిరస్మరణీయం

-ఎమ్మెల్యే సండ్ర
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో కుట్టు మిషన్లు మరియు చేతి పంపులు, నీటి ట్యాంకులు, బడ్డీ కొట్టులు ఎస్ ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డా. షేక్ మహమ్మద్ రఫీ అనేక సేవలు అందిస్తుండటం. మరియు ఈ ట్రస్ట్ సేవలు తెలంగాణా రాష్ట్రం సత్తుపల్లి చుట్టు పక్కల గ్రామాలలో మరియు సత్తుపల్లి నియోజకవర్గం లో అనేక చోట్ల విస్తరించటంతో సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య వెంటనే స్పందించి ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. షేక్ మహమ్మద్ రఫీ నివాసమైన తిరువూరు రాజుపేట లో ఆయన స్వగృహానికి విచ్చేసి 20 గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ లతో కలిసి శాలువా తో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమం అనంతరం సండ్ర మాట్లాడుతూ పార్టీలకు అతీతం గా నిరుపేద ప్రజలకు ట్రస్ట్ ద్వారా ఉపాధి కల్పించటం చాలా పుణ్యం అని అలాగే సత్తుపల్లి లో ఎన్నో గ్రామాలలో ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా షేక్ మహమ్మద్ రఫీ చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం అని తెలియజేసి పేద ప్రజలకు ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు ట్రస్ట్ నుంచి నేరుగా పేద ప్రజలకు అందజేయాలని మనసు పూర్తిగా కోరారు.


SAKSHITHA NEWS