మైనార్టీ బంధు ప్రకటించాలి
12 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రాష్ట్రంలో మైనార్టీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఖమ్మం నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాను.. చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తామని లక్షలాది దరఖాస్తులు తీసుకుని తూతూమంత్రంగా కొద్దికే లోన్లు ఇవ్వడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమ శాఖకు ఒక ముస్లిం మంత్రిని నియమించకపోడంతోనై మైనార్టీలపై కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ది ఉందో అర్శమతుందని అన్నారు.
కార్పోరేషన్ లోన్లతో మైనార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీ బంధు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనార్టీ బంధు ప్రకటించేదాకా.. పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై చూపుతున్న వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల వివక్షకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ సహా ఖమ్మం సిటీ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే అబ్బాస్ బేగ్, సయ్యద్ మహమ్మద్, సయ్యద్ జహీర్, త్రీ టౌన్ మైనారిటీ చైర్మన్ ఎస్ కే ఇబ్రహీం, మొహమ్మద్ అహ్మద్ మొహమ్మద్ షారుక్, ఎస్ కే రియాజ్, సయ్యద్ ఫరీద్, ఎస్ కె ఖలీల్, ఎస్కే సుభాని, ఎస్కే మౌలాలి పాల్గొన్నారు.