విద్యార్థులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు

Spread the love

విద్యార్థులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు
కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్…
విద్యార్థులు చదువుకుంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నారు.

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యార్థుల వీడ్కోలు సమావేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ముందుకెళ్లాలని ఉపాధ్యాయులను అనుసరిస్తూ చదువుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులపై మంచి శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ ఎడ్మ సత్యం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి అధ్యాపకులు సదానందం గౌడ్, కూన శ్రీనివాసులు, కౌన్సిలర్లు షేక్ ఏజాస్, గోరేటి శ్రీనివాసులు నాయకులు మసూద్, ఆనంద్ గౌడ్, పడకంటి వెంకటేష్,దున్న సురేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page