SAKSHITHA NEWS


In the budget, the government has given priority to welfare agriculture sectors.

బడ్జెట్లో సంక్షేమ వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట.
దేశంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెటే భేష్.*
ప్రతిపక్షాలు రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నాయి.*
జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.*
మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాదులో ఐటీ పరిశ్రమలు.*

కెసిఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు భరోసా పెరిగింది

కోదాడలో నిర్మించిన శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం చరిత్రలో నిలిచిపోతుంది

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించి బడ్జెట్ ఆమోదించారు
విలేకరుల సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
పాల్గొన్న కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ , ఎమ్మెల్యే నలబోతు భాస్కర్ రావు *


సాక్షిత : భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు కితాబు ఇచ్చారు. బుధవారం కోదాడ పట్టణం అనంతగిరి రోడ్ లో నూతనంగా నిర్మించిన లింగమంతుల స్వామి దేవస్థానాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి * సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దేవాలయం, చెరువు చుట్టుపక్కల చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చైర్మన్ సుఖేందర్ రెడ్డి దృష్టికి తీసుకెల్లి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో *కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ శాసనసభ్యులు నలబోతు భాస్కర్ రావుల తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. గత 8 ఏళ్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై ప్రజలకు భరోసా పెరిగింది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రైతులంతా సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ రాజకీయాలను బ్రష్టు చేస్తున్నాయని దేవ చేశారు కేవలం తిట్ల ద్వారానే తమకు గొప్పదనం వస్తుందని చెప్పలేనటువంటి పరిభాషలో మాట్లాడే తీరు సరైనది కాదు అని ఆయన హెచ్చరించారు

శాంతిభద్రతల్లో తెలంగాణ రాష్ట్రం నేడు అగ్రస్థానంలో ఉందన్నారు దేశవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఇది తెలంగాణకు గర్వకారణం అన్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఇండస్ట్రియల్ ఐటీ పార్కులు రావడానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నేడు జాతీయస్థాయిలో గుర్తింపు పొంది ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీతో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించుతారన్నారు. సంక్షేమ పథకాలే పార్టీకి భరోసా అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని, ఎమ్మెల్యే భాస్కరరావు లను శాలువాతో సత్కరించారు.


SAKSHITHA NEWS