Syed Anwar’s house was accidentally burnt
సాక్షిత : కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీ కి చెందిన సయ్యద్ అన్వర్ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో సమాచారం తెలిసిన వెంటనే మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాద వశాత్తు ఇల్లు దగ్ధం అవడం చాలా బాధాకరమైన విషయం అని ,ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు ,బట్టలు ,సామాగ్రి మొత్తము కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం అని, తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానాని ,నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , అధైర్య పడకూడదని భరోసా కలిపించడం జరిగినది అని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయం చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,ఆస్బె స్టాస్ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు అబుల్, ఖయ్యుమ్,కృష్ణ, రఫీక్, రజక్,శ్రీ జ్యోతి, కుమారి, స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు.