Sports foster a sense of camaraderie.
క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి.
స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సభలో నగర మేయర్ పూనకొల్లు నీరజ.
పుల్వామా అమరవీరులకు ఘన నివాళి.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
క్రీడలు విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని నగర మేయర్ పూనకొల్లు నీరజ తెలియజేశారు. స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ముగిసిన స్పోర్ట్స్ మీట్ ముగింపు సభకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన, సాన్నిహిత్యం పెరుగుతాయన్నారు. దీనివలన స్నేహం పెరిగి విద్యార్థి బృందాల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. పాఠాలతో పాటు ఆటల్లోనూ ప్రావీణ్యం పెంచుతున్న స్మార్ట్ కిడ్జ్ యాజమాన్యాన్ని ప్రశంసించారు.
పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తమ పాఠశాల ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నామన్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో, పర్వదిన ఉత్సవాల నిర్వహణ, పిక్నిక్ లు , ప్రజా ప్రయోజన స్థలాల సందర్శన తదితర అంశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూన్నామన్నారు.
స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యార్థుల్లో క్రీడా చైతన్యం పెంచుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, 55 వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, 56 వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ , పి ఈ టి క్రాంతి కిరణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. తొలుత విద్యార్థులు భరతనాట్యంతో అతిధులకు స్వాగతం పలికారు. సభలో పుల్వామా అమరవీరులకు ఘన నివాళి అర్పించారు.