SAKSHITHA NEWS

Members of State Vaddera Welfare Association honored MLA KP Vivekanand

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను ఘనంగా సన్మానించిన రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వడ్డెర కులస్తుల సమస్యలపై గళమెత్తిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని రాష్ట్ర అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

వడ్డెర జాతిని బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలన్న తమ డిమాండ్ ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి మొట్టమొదడి సారిగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ వేముల లక్ష్మణ్, నేషనల్ హానరబుల్ ప్రెసిడెంట్ నారాయణ స్వామి, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ తిరుమల దేవి, నేషనల్ జనరల్ సెక్రెటరీ గుంజ శ్రీనివాస్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ ఎత్తరి మారయ్య, జనరల్ సెక్రెటరీ గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్లు నారాయణ, రామ కృష్ణ, నర్సింహా, వైస్ ప్రెసిడెంట్ పుల్లయ్య, సెక్రటరీ స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమయ్య, ట్రెజరర్ పీట్ల మల్లేష్, స్టేట్ మహిళా ప్రెసిడెంట్ రేణుక, సోషల్ మీడియా కన్వీనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS