SAKSHITHA NEWS


Sewerage in Bhimunikunta Pond under Hyder Nagar Division

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీమునికుంట చెరువు లో కి సీవరేజ్ నీరు కలుస్తున్నదని తెలుసుకొని, వాటిని చెరువులోకి చేరకుండా మళ్లించడానికి, ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.

ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని,

అదే విధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్య మంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో, ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదితామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ ఈ విశ్వం, జిహెచ్ఎంసి ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కుమార స్వామి, రాజుసాగర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS