Launch of second phase “Telangana Kanti Velam Scheme
రెండోదశ “తెలంగాణ కంటి వెలుగు పథకం” ప్రారంభం*.
సాక్షిత : నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
ఎల్లుండి నుండి నియోజకవర్గంలో కంటి పరీక్షలు ప్రారంభం*.
ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ .
దృష్టిలోపాలను నివారించి.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కంటి వెలుగు పథకం” కోసం చెన్నూరు నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ మేరకు 19.01.23 (గురువారం) తేదీన నియోజకవర్గంలో నిర్వహించే 11 పరీక్ష శిబిరాల వివరాలను వెల్లడించారు.
చెన్నూరు మండలం : అంగరాజ్ పల్లి గ్రామ రైతు వేదిక, కాచన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల.
జైపూర్ మండలం: జైపూర్ గ్రామంలోని PHC సెంటర్, బెజ్జాల గ్రామంలోని గ్రామపంచాయతీ భవనం.
కోటపల్లి మండలం: సర్వాయిపేట గ్రామంలోని కమ్యూనిటీ భవనం, వెంచపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్.
భీమారం మండలం: భీమారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం.
మందమర్రి మండలం: ఆదిల్ పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల.
చెన్నూరు మున్సిపాలిటీ: ఒకటవ వార్డులోని బ్రాహ్మణ సంఘం భవనం.
మందమర్రి మున్సిపాలిటీ : ఒకటవ వార్డులోని పద్మశాలి భవనం.
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ : ఒకటవ వార్డులోని డివినిటీ పాఠశాలలో కంటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పరీక్షల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.