Chandrababu’s publicity maddened that this incident happened, said the Home Minister
అమరావతి
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి
కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత.
40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ పెట్టడం ఎంతవరకు సబుబని ప్రశ్నించిన హోం మినిస్టర్.
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డ హోంమంత్రి వనిత.
గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేసిన హోం మంత్రి.
చంద్రబాబు కు ఇదేమి పబ్లిసిటీ పిచ్చని ప్రజలందరూ ఇదేమి ఖర్మ రా బాబు అని బాధపడుతున్నారన్న హోం మినిస్టర్
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏంటని ప్రశ్నించిన హోంమంత్రి.
సీఎం జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడిన హోంమంత్రి వనిత.
సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్న హోం మినిస్టర్.
చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి ఖర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారన్న హోం మంత్రి
కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపిన హోంమంత్రి వనిత.
ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న హోం మినిస్టర్.