Councilor Narsa Reddy Srinivas Reddy who planted the deity trees of Bhaurampet Sri Asrita Vatsala
భౌరంపేట్ శ్రీ ఆశ్రిత వత్సల అయ్యప్పస్వామి దేవాలయంలో దేవతా వృక్షాలను నాటిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ శ్రీ శ్రీ ఆశ్రిత వత్సల అయ్యప్పస్వామి దేవాలయం లో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం లో అనేక దేవతా వృక్షాలను నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చి దైవ దర్శనంతో పాటు వృక్షాలను పూజించే విధంగా మారేడు,
మహాబిల్వం , ఏకబిల్వం, ఉసిరి, జమ్మి, తులసి, బ్రమ్మ కమలం, తెల్ల జిల్లేడు, శ్రీగంధం వంటి చెట్లతో పాటు నంది వర్దనం, సంపెంగ, శంకుపుష్పం, గులాబీ , గన్నేరు, నూరు వరాలు లాంటి 50 రకాల చెట్లను పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామిరెడ్డి , మల్లారెడ్డి , మన్నె షేకర్ , చంద్రశేఖర్ రెడ్డి , మన్నె బాలరాజు , వెంకట్ , యాదయ్య గౌడ్ మరియు అయ్యప్పస్వామి మలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.