SAKSHITHA NEWS

Quran is calling in Hyderabad book fair…

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఖుర్ఆన్ పిలుస్తోంది…!

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిహాద్.. అంటే ఎదుటి మతం వారిని హింసించడమా?
ఇస్లామ్ మహిళలను అణచివేస్తోంది
తలాక్ .. తలాక్..తలాక్…


ముస్లిమ్ మహిళలు ధరించే హిజాబ్ ఆదేశం ఖుర్ఆన్ లో అసలు ఉందా? లేదా?
నిత్యం వార్తల్లో ఇస్లామ్ పై ఏదో ఒక అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. మీడియాలో వచ్చేదే ప్రజలు నిజమనుకుంటారు కూడా. ప్రజల్లో ఇస్లామో ఫోబియా వేగంగా ప్రబలుతోంది. ఇస్లామ్ సాహిత్యాన్ని చదివితేనే ఇస్లామ్ పై ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి అవుతాయి. అవన్నీ నిక్షిప్తమై ఉన్న ఎన్నో పుస్తకాలు హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్టాల్ నెంబరు 156లో కొలువుదీరి ఉన్నాయి.


ఇస్లామ్ పై అపోహలు అపార్థాలను తొలగించేందుకు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్య కృషిచేస్తోంది. ఉర్దూలో ఉన్న ఇస్లామ్ సాహిత్యాన్ని తెలుగులో ప్రచురించి తెలుగు విభిన్న వర్గాలకు వారధిగా నిలుస్తోంది. ట్రస్టు ప్రచురిస్తున్న ప్రచురణలకు అంతకంతకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఎక్కడ పుస్తక ప్రదర్శనలు, బుక్ ఫెయిర్ లు జరిగినా తెలుగు ఇస్లామిక్ బుక్ స్టాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలుగు ఇస్లామిక్ ప్రచురణల సంచాలకులు సలీమ్ అహ్మద్ ఖాన్ అంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగులో ఖుర్ఆన్, ఇతర ఇస్లామిక్ పుస్తకాల అమ్మకాలు జోరందకున్నాయి. స్టాల్ నెంబరు 156లో 300కు పైగా శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.


ఇస్లామ్ ధర్మం శాంతి, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని, మంచిని పెంచి, చెడును తుంచేలా ఖుర్ఆన్ బోధనలున్నాయని ఈ స్టాల్ లో లభించే ప్రతీ పుస్తకం సాక్ష్యమిస్తుంది. అతి తక్కువ ధరలో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలే కాకుండా సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో జాడ్యాలకు ఖుర్ఆన్ సూచించే పరిష్కారాలతో కూడిన గ్రంథాలు అందుబాటులో ఉంచారు.

వడ్డీ కీడు, ఇస్లామ్ లో మద్య నిషేధం, ఇస్లామ్ లో మహిళలు, ఇస్లామియ పరిభాషలో జిహాద్ అనే పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇటీవలె కాలంలో ముహమ్మద్ ప్రవక్తపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన వాస్తవ జీవితాన్ని అధ్యయనం చేసేందుకు చాలామంది ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పుస్తకాలను ఎక్కువుగా కొంటున్నారు.
నమాజు ఎలా చదవాలి?


ఇస్లామ్ పై ఎంతగా విమర్శలు వస్తున్నాయో? అంతే ఎక్కువుగా ఇస్లామ్ విశ్వాసాలు, సంప్రదాయాలపై అధ్యయనం జరుగుతుందన్నది పలు సర్వేలు చెబుతున్నాయ్. నమాజు చదివే పద్ధతి గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రమజాన్ లో ముస్లిములు పాటించే రోజా (ఉపవాసాల) గురించి కూడా పుస్తకాలు అడుగుతున్నారని సేల్స్ మేనేజర్ యాసీన్ తెలిపారు. పిల్లలకోసం నీతి కథల పుస్తకాలూ ఉన్నాయి. మహిళలు ఎక్కువుగా హిజాబ్, పరదా పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు.


SAKSHITHA NEWS