SAKSHITHA NEWS

Christ’s teachings are an inspiring answer of peace to live by

క్రీస్తు బోధనలు స్పూర్తిదాయకం

శాంతి సమాధానంతో జీవించాలి

సహనం, క్షమాగుణం అలవర్చుకోవాలి.
క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
కరోనా వేళ జాగ్రత్తలు అవసరం
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఏసుక్రీస్తు బోధనలు నేటి సభ్య సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.. ఆచరణీయం.. అద్భుతమైనవని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎంపీ నామ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ చరిత్ర ఎంతో స్పూర్తిదాయకమన్నారు. క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఏసు అంటేనే రక్షణ అని, అదే క్రిస్మస్ అన్నారు.

సమాజ అభ్యున్నతికి ఆయన తెలిపిన పది ఆజ్ఞలను ఆచారిస్తే సమస్తం లోకకళ్యాణమే అవుతుందని నామ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సర్వ మతాల పట్ల సహనం, అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచ శాంతి కోసం ఏసుక్రీస్తు ఎంతో త్యాగం చేశారన్నారు. ఏసు ఏదైతే చెప్పారో క్రైస్తవులు వాటిని ఆచరిస్తూ ముందుకు పోవాలని నామ అన్నారు. లోకాన్ని ఎంతగానో ప్రేమించిన క్రీస్తు మానవ కోటి రక్షణార్ధం ప్రాణ త్యాగం చేసినట్లు బైబిల్ చెబుతుందన్నారు. క్రీసు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ సహనం, శాంతి క్షమాగుణం, కరుణ అలవరుచు కోవాలన్నారు

. కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పును కలిగి ఉండాలన్నారు. శాంతి, సహనం జీసస్ లోకానికి చూపిన పవిత్ర మార్గమన్నారు. ప్రజలంతా ప్రేమ, శాంతి, సమాధానంతో జీవించాలని సూచించారని అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమను అందరికి పంచాలని నామ అన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకించి, కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని మతాల వారిని గౌరవిస్తూ ప్రభుత్వపరంగా పండుగలను నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను ఎంతో అందంగా అలంకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రంగుల కాగితాలతో పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి, ఇంటిపై వేలాడ దీసిన దృశ్యాలు, ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీ అలంకరణలు చూపరులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. క్రిస్మస్ పెద్ద సాంస్కృతిక వేడుక పండుగ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ ను గొప్పగా జరుపుకునే పండుగ అన్నారు.

క్రీస్తు పుట్టిన ఈ శుభ దినాన కుటుంబాల్లో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటున్నట్లు ఎంపీ నామ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని నామ ఆకాంక్షించారు. పండుగ వేళ అంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని నామ సూచించారు.


SAKSHITHA NEWS