Semi-Christmas celebrations in Sarvajna
సర్వజ్ఞలో సెమీ క్రిస్మస్ వేడుకలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం నగరంలో వి.డి.వోస్ కాలనీలో సర్వజ్ఞ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నక్షత్రాల వెలుగులో, దేవదూతల ప్రకాశంలో, పశువుల పాకలో లోకాన్ని రక్షించటం. కోసం, పాపాన్ని విమోచించటం కోసం శిత్తునిగా జన్మించిన యేసుక్రీస్తు జననం యావత్ ప్రపంచానికి శుభదినం.
ఈ శుభదినాన్ని వి.డి.వోస్ కాలనీ సర్వజ్ఞ పాఠశాలలో కళ్ళకు కట్టినట్లు సెమీ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్మహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ శ్రీమతి నీలిమ, శ్రీ ఆర్.వి నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. పశువుల పాక, క్రిస్మస్ ట్రీలతో, నక్షత్రాలతో, దేవదూతల వేషధారణలతో చిన్నారులు ప్రాంగణమంత క్రీస్తు జన్మస్థలాన్ని తలపించేలా అలంకరించారు.
చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణతో తోటి స్నేహితులకు బహుమతులు పంచారు. ప్రపంచదేశాలకు శాంతి సందేశం యిచ్చిన క్రీస్తు వేషధారణతో విద్యార్థులు శాంతి సందేశాన్ని తెలియజేసారు. క్రిస్మస్ గేయాలను ఆలపించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీమతి నీలిమ మాట్లాడుతూ సర్వమతాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సహనం, శాంతి, క్షమాగుణం,
కరుణ అలవరచుకోవాలని, క్రీస్తు వలె శత్రువులను సహితం ప్రేమించే, క్షమించే గుణం కలిగి ఉండాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. క్రిస్మస్ కేకు కట్చేసి చిన్నారులకు పంచారు. హాపీ క్రిస్మస్, మేర్ క్రిస్మస్ అంటూ నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది.
పాఠశాల డైరెక్టర్స్ శ్రీమతి నీలిమ, శ్రీ ఆర్. వి నాగేంద్రకుమార్, ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.