Let’s work together as officials: Vikarabad MLA
కార్యధీక్షులై కలిసికట్టుగా పని చేసుకుందాం: వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ మండల BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలన్నారు.
పార్టీ పటిష్టతకు, పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తూ… వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.