SAKSHITHA NEWS

Toll plaza workers sit on dharna at Chilakapalem toll plaza

image 25

చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా కార్మికులు ధర్నా.

యాంకర్ :శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం టోల్ ప్లాజాలో పనిచేసే ఉద్యోగుల, ఉదయం సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.చిలకపాలెం టోల్ ప్లాజా లో ఉద్యోగుల106మంది 2007నుంచి నేటికి16సంవత్సరాలాగా,పనిచేస్తున్నారు.ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ రహదారిపై 60కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా ఉండాలని నిబంధనలు వలన,NHAI అధికారులు చిలకపాలెం టోల్ ప్లాజాను బుధవారం అర్ధరాత్రితో టోల్ వసూళ్లు నిలిపివేశారు.ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న,106 మంది ఉద్యోగులకు,ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంతో ఉపాధి లేక కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.టోల్ ప్లాజానే నమ్ముకొని 16సంవత్సరాలు పొల్యూషన్ బారినపడి అనేకమంది అనారోగ్యంతో బాధపడుతున్న కనీసం పట్టించుకోని పాపానికి హైవే అధికారులు లేరని,వాహనం దారులు ఈ టోల్గేట్ లో చెల్లించవలసిన రుసుము నతవలస, మడపాములో ఉన్న టోల్ ప్లాజాకు షేర్ చేసి ఆదాయంలో జాగ్రత్తలు తీసుకున్నా అధికారులు ఉద్యోగుల పట్ల వివక్షత చూపడం సరికాదని CITU శ్రీకాకుళం జిల్లా నాయకులు అన్నారు.

బైట్స్ : పి.తేజేశ్వరరావు

కార్మికుడు…


SAKSHITHA NEWS