దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవస్థాన రాజగోపురం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి లో శ్రీ సీతారామ చంద్ర స్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రాజగోపురం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవారాధనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బూర్గుబావి హనుమంతరావు, బూర్గుబావి సత్యనారాయణ, బి శివకుమార్, డప్పు నరేందర్ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ప్రజలు భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల పెద్దలు కార్తీక మాస కార్తీకమాస మన భోజన మహోత్సవానికి ఆహ్వానాలు అందజేశారు
దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి
Related Posts
క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..
SAKSHITHA NEWS క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు… కోదాడ సూర్యాపేట జిల్లా నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ఆనవాయితీను దానిలో భాగంగా…
ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
SAKSHITHA NEWS సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.ఈ సందర్భంగా ఈ నెల నాలుగవ తేదిన పెద్దపెల్లి…