SAKSHITHA NEWS

Delay in works is intolerable – Commissioner Anupama Anjali

పనుల విషయంలో జాప్యం సహించరానిది – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత తిరుపతి : ప్రజాభివృద్ది పనుల విషయంలో జాప్యం సహించరానిదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పరిస్థితులపై గురువారం అంకురా హాస్పిటల్, గొల్లవానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్లను కమిషనర్ అనుపమ పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్ నిర్మించే స్థలంలో కొన్ని చోట్ల ఖాళీగా వున్న స్థలాల్లోని యజమానులు రాకపోవడంతో పనులు జాప్యం జరుగుతున్న విషయాన్ని ప్రస్థావిస్తూ ఆ ఖాళీ స్థలాల యజమానులు ఎక్కడున్నారో కనుక్కోని వారికి నోటీసులు జారీ చేసి పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు.

లీగల్ సమస్యలు వున్నచోట ఆయా స్థలాలను మార్క్ చేసి మిగిలిన స్థలాల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని చోట్ల కరెంట్ పోల్స్ ఇంకనూ విస్తరించిన రహదారి మధ్యలోనే వుండటాన్ని చూపిస్తూ విధ్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రక్కకు తరలించేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS