తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారు – ఎమ్మెల్యే భూమన

Spread the love

Chief Minister is contributing to the development of Tirupati – MLA Bhumana

తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారు – ఎమ్మెల్యే భూమన


సాక్షిత : తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో 5, 32, 50 డివిజన్లలో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి పూజలు నిర్వహించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ప్రజలు కోరుకుంట్టున్న అభివృద్ది పనులను శరవేగంతో పూర్తి చేయడం జరుగుతున్నదని, తిరుపతి నగరపాలక సంస్థ త్వరితగతిన ప్రజాభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇంకనూ పూర్తి చేయాల్సిన పనులన్నింటిని దశల వారికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ప్రజలకి అవసరమైన పనులను గుర్తించి పూర్తి చేస్తున్నామన్నారు. గురువారం ప్రారంభించిన పనుల వివరాలను తెలియజేస్తూ 4వ వార్డులో 30 లక్షలతో సిసి కాలువలు, కనెక్టెవిటి రోడ్, 32వ వార్డులో 38 లక్షలతో నిర్మించిన సిసిరోడ్, కాలువలు, 50వ వార్డు లెప్రసీ కాలనీలో 21 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఆ వార్డు కార్పొరేటర్లు పుల్లూరు అమరనాధ్ రెడ్డి, తిరుత్తణి శైలజా, బోకం అనీల్ కుమార్, ఇతర కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆధం రాధాకృష్ణ రెడ్డి, రుద్రరాజు శ్రీదేవి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామి రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, దేవిక, వైసిపి నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, తిరుత్తణి వేణుగోపాల్, తలారి రాజేంధ్ర, దేవదానం, దొరైరాజు, శ్యామల, పునీత, శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page