SAKSHITHA NEWS

All eligible should be added to the list of voters; Deputy Speaker Padma Rao Goud

అర్హులందరికీ ఓటర్ల జాబితాల్లో స్థానం కలిపించాలి ; డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


సాక్షిత సికింద్రాబాద్ ; అర్హు లైన ఓటర్ల పేర్లన్నీ జాబితాల్లో కొనసాగేలా జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఓటర్ల సవరణ ప్రక్రియ పై ఓ అవగాహనా కార్యక్రమం గురువారం సితఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

ఈ శిబిరాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజా స్వామ్య ప్రక్రియలో ఓటు విలువ గొప్పదని, పౌరులు తమ హక్కును వినియోగించుకొనే అవకాశం అధికార యంత్రాంగం కల్పించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా వివరించారు.

కొత్త ఓటర్లందరి పేర్లను నమోదు చేయించాలని సూచించారు. కార్పొరేటర్లు, శ్రేణులు, స్థానిక ప్రముఖులు ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని కోరారు. జీ హెచ్ ఏం సీ ఉప కమీషనర్ దశరద్ మాట్లాడుతూ సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఓటర్ల సవరణ ప్రక్రియ పకడ్డబందీగా సాగుతోందని తెలిపారు.

సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, తెరాస యువ నేత తీగుల్ల కిరణ్ కుమార్, సమన్వయ కర్త రాజ సుందర్, నాయకులు లింగాని శ్రీనివాస్, కంది నారాయణ, ప్రాజెక్ట్ అధికారి శ్రీనాద్, అసిస్టెంట్ కమీషనర్ నరసింహా రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS