Religions are different but the path is the same
మతాలు వేరైనా మార్గం ఒక్కటే
సాక్షిత రంగారెడ్డి జిల్లా:దైవ చింతన సామాజిక సేవ ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవాని అన్నారు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి. గురువారం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో నగర మాజీ మేయర్,
మహేశ్వరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుల తీగల కృష్ణారెడ్డి గురుస్వామిని కందుకూరు మండల ఎంపిటీసిల పోరం మూల హనుమంత్ రెడ్డి, రైతు సమన్వయ,రైతు బందు ఆద్యక్షడు గోపిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, విద్యార్థి నాయకుడు శివరామకృష్ణ రెడ్డి,సాయికుమార్ తదితరులు కలసి తీగల కృష్ణా రెడ్డిని ఘనంగా సత్కరించారు.
అయ్యప్ప మాల విశిష్టత పూజా విధానం మాల ధారన ద్వారా భక్తి చింతన కలిగించటం వంటి దైవభక్తి కార్యక్రమాలు చేసే తీగల కృష్ణా రెడ్డి గురుస్వామి అయ్యప్ప దర్శనానికి 26 వసారి మాలధారణ చేసి అయ్యప్ప సన్నిధాన దర్శనం వెళుతున్న సందర్భంగా వారు ఘనసన్మానం చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ,,,ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత అని దైవ చింతన సామాజిక సేవ ద్వారా జీవితాన్ని పలప్రధం చేసుకోవాలని అలాకాకుండా పాపభీతి లేకుండా జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.
మానవ జీవితం కష్టసుఖాల సంగమం.ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం అని అన్నారు..