Poverty should not be a barrier to the education of the poor
పేదల చదువుకు పేదరికం అడ్డు కాకూడదు…* అందుకే విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న జగనన్న…*
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు._*
_
సాక్షిత : విద్యాభ్యాసానికి పేదరికం అడ్డు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ నాడు-నేడు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు._
జి.కొండూరు మండలంలోని చెరువు మాధవరం గ్రామంలో నాడు-నేడు పథకం రెండో విడత కింద రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎంపియూపీ పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు అవసరమైన అన్ని వసతులను, మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత ప్రభుత్వానిది అయితే లక్ష్యం దిశగా విద్యను అభ్యసించే బాధ్యత విద్యార్థులదే అని సూచించారు. పిల్లల విద్యాభివద్ధికి తల్లులే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ఉపాధ్యాయులు కూడా అంకితభావంతో పని చేసి విద్యార్థులను సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.