SAKSHITHA NEWS

Registrations should be done immediately in gram panchayat layouts

గ్రామపంచాయతీ లేఔట్లలో వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలి
. రిజిస్ట్రేషన్ కార్యాలయం లో మెమోరాండం సమర్పించిన షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి*

గ్రామపంచాయతీ లేఔట్లలో మిగిలిపోయిన ప్లాట్లను, హైకోర్టు ఆర్డర్ తో రిజిస్ట్రేషన్ అయినా ప్లాట్లు, GPA, AGPA ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేసి గ్రామపంచాయతీ లేఔట్ యాజమాన్లను రక్షించాలని షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు పీర్లగూడెం రాజు గౌడ్ అన్నారు

. తేది 22.11.2022 నాడు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యర్యంలో హైదరాబాద్ లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐ జి కార్యాలయం ముట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అధ్యక్షులు రాజు గౌడ్ అధ్యర్యంలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ సోదరులు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం లో సబ్ రిజిస్టర్ సతీష్ కు మెమోరాండం (వినతి పత్రం) సమర్పించారు

.ఈ సందర్బంగా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు రాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు స్థానిక సబ్ రిజిస్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించి పై అధికారుల దృష్టి కి తీసుకెళ్లాలని, పాత పద్ధతి లోనే యధావిధిగా రిజిస్ట్రేషన్స్ జరుపాలని కోరారు..

ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు కబీర్, జనరల్ సెక్రటరీ మంచిరేవుల అశోక్, ట్రేజరర్ సతీష్, సుధాకర్ రెడ్డి, ఖాలేదు ఖాన్, అజ్మత్, హైదర్ గోరి,కుమ్మరి శ్రీశైలం, సాదిక్, ఇర్ఫాన్,కృష్ణ, వినోద్, అన్వార్, అసిఫ్, నాగేష్,మంగలి రాంచంద్రయ్య, కల్లేపల్లి రాజు, క్లాసిక్ రాజు, అబ్దుల్లా, శంకర్ నాయక్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS