SAKSHITHA NEWS

MLA who started Kanyakumari ‘K2K’ cycle ride from Kashmir…

కాశ్మీర్ నుండి కన్యాకుమారి ‘కే 2 కే‘ సైకిల్ రైడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సాక్షిత : హైదరాబాద్‌ సైకిలిస్ట్ గ్రూప్‌ వ్యవస్థాపకుడు రవీందర్ నందనూరి ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 3700 కిలోమీటర్లు.. 12 మంది రైడర్లతో.. 23 రోజులు రెండవ సారి చేపడుతున్న కే 2 కే సైకిల్‌ రైడ్‌ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ ను “సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా నిలపాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతున్న హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూపు రాబోయే రోజుల్లో మరెన్నో సాధించాలన్నారు. అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సైక్లిస్ట్ గ్రూపులు కే 2 కే రైడ్ ను చూసి ముందుకు రావాలన్నారు. అన్ని రాష్ట్రాల సైకిలిస్ట్ లు కూడా ఈ విధంగానే సైక్లింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రవీందర్ నందనూరి మాట్లాడుతూ…


గతంలో ఎమ్మెల్యే సహకారంతో 2700 కిలోమీటర్ల రైడ్ ను దిగ్విజయంగా పూర్తి చేశామని ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సారి కూడ ఎమ్మెల్యే సహకారంతో అంతే ఉత్సాహంతో పూర్తి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రవీందర్ రెడ్డి, ప్రవీణ్ గడిల, భీమ్ సింగ్, తేజేశ్వర్, రిత్విక్ మెల్వాని, రైడర్లు బృంద, ఉమామహేశ్, శివ్, జనార్ధన్, అలెగ్జాండర్, సుబ్బయ్య, అచ్యుత్, అనిల్, చైత్ర, భవేశ్, హృషి రెడ్డి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS