SAKSHITHA NEWS

Akkarampally Master Plan Road inspected Commissioner.

అక్కారంపల్లి మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిశీలించిన కమిషనర్.


సాక్షిత : * నగరపాలక సంస్థ పరిధిలోని అక్కారంపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను జోరువానలో సైతం కమిషనర్ అనుపమ అంజలి పరిశీలించారు.


బుధవారం మధ్యాహ్నం కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి, అదనపు కమిషనర్ సునీత, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి అక్కారంపల్లి స్కూల్ వద్దకు చేరుకుని మాస్టర్ ప్లాన్ వెళుతున్న మార్గంలో ఉన్న నిర్మాణాలను పరిశీలించారు.


ఇల్లు కోల్పోతున్న వారికి వెంటనే టి.డి.ఆర్. బాండ్లు అందించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు తీసి మురుగునీరు వెళ్లేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయం చేసుకుని రోడ్డు ఏర్పాటు చేసి గ్రావెల్ తో నింపి వాహనాల రాకపోకలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, ఏ సి పి బాలసుబ్రహ్మణ్యం, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS