SAKSHITHA NEWS

Public development is our first step – MLA Bhumana

ప్రజాభివృద్దికే మా ముందడుగు – ఎమ్మెల్యే భూమన


సాక్షిత తిరుపతి : ప్రజాభివృద్దికే మా ముందడుగు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు ప్రారంభించారు

. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. నగరాభివృద్దికి నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అవసరమైన పనులను నెరవేర్చడం జరుగుతున్నదన్నారు. మేయర్ శిరీష మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సూచనలతో తమ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు సమన్వయ కృషితో ప్రజాభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కమిషన్ అనుపమ అంజలి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ 14వార్డులోని కేశవాయనగుంటలో 90 లక్షలతో నిర్మించిన పెద్ద కాలువని, రాఘవేంధ్రనగర్లో 10 లక్షలతో పూర్తి చేసిన సిసి రోడ్డును ప్రారంభించడం జరిగిందన్నారు. అదే 14వ డివిజన్లో 83 లక్షలతో నిర్మించబోవు పెద్ద కాలువ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయడం జరిగిందన్నారు.

ఇక 6వ డివిజన్ కార్పొరేటర్ జానకి వార్డులో 24 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కౌన్సిల్ స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు,

రామస్వామి వెంకటేశ్వర్లు, అమరనాధ్ రెడ్డి, ఆధం రాధాకృష్ణా రెడ్డి, తిరుపతి మునిరామిరెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రారెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు మహేష్, సంజీవ్ కుమార్, వైసిపి నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, జ్యోతి ప్రకాష్, తలారి రాజేంధ్ర, గీత, బాలిశెట్టి కిశోర్, శ్యామల, టిటిడి రిటైర్డ్ డిప్యూటీ ఈఓ రెడ్డివారి ప్రభాకర రెడ్డి, సంకల్ప రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS