SAKSHITHA NEWS

The MLC is a home for the poor who are homeless due to short circuit

 షార్ట్ సర్క్యూట్ కారణంగా నిరాశ్రయులైన నిరుపేదలకు బాసటగా నిలిచిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

 సాక్షిత  :   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్ ఇందిరా నగర్ బస్తీలో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు పొట్ట కూటి కోసం వచ్చి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే  షార్ట్ సర్క్యూట్ కారణంగా 8 గుడిసెలు కాలిపోయాయి. 


మంటల్లో వారి నిత్యావసరాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. నిజాంపేట్ మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ల ద్వారా విషయం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిరాశ్రయులైన పేదలందరికి ఆర్థిక సహాయం అందజేసి బాసటగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, చిట్ల దివాకర్, కో ఆప్షన్ సభ్యులు సలీం, సీనియర్ నాయకులు రవికాంత్, జగన్, దూసకంటి వెంకటేష్, సందీప్, సురేష్, హరియా నాయక్, పరమేష్, రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
image 107

SAKSHITHA NEWS