సాక్షిత : అభివృధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని , దళారీ వ్యవస్థను పూర్తిగా నివారించమని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తార్నాక డివిజన్ లో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం లో ఉప సభాపతి పద్మారావు గౌడ్ పింఛన్ల గుర్తుపు కార్డులు పంపిణి చేశారు. అనంతరం బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్సాపొరేట ర్ శ్రీమతి కంది శైలజతో బౌద్దనగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్ లో బౌద్దనగర్ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు ఆసరా పించన్ల గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గతంలో సుమారుగా 16 వేల మందికి ఆసరా పించన్లు అందించమని, కొత్తగా మరో ఆరు వేల మందికి ప్రస్తుత విడతలో పించన్లు మంజురయ్యయని తెలిపారు. అర్పింహులందరికీ పించన్చలు అందిస్తామని తెలిపారు. ఎం ఆర్ ఓ లు శ్రీమతి మాధవి, అయ్యప్ప,, స్థానిక ప్రముఖులతో పాటు కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి. కంది నారాయణ, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఒక్కో లబ్దిదారుని వివరాలను ఆర తీస్తూ గుర్తింపు కార్డులను అందించారు
అభివృధి, సంక్షేమ కార్యక్రమాల అమలు
Related Posts
గోనూరు యాదగిరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
SAKSHITHA NEWS గోనూరు యాదగిరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే* సాక్షిత వనపర్తి :ఈనెల 13న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన వనపర్తి పట్టణవాసి గోనూరు యాదగిరి కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరామర్శించారు హైదరాబాదులోని పెళ్లిళ్ళో ఎంతో…
ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
SAKSHITHA NEWS ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ నారాయణపేట – మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని…