SAKSHITHA NEWS


Distribution of gold gift bathukamma sarees in gold Telangana

బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరల పంపిణీ
చేనేత కార్మికులకు చేయూత

*
12 రకాల చీరల పంపిణీ తో ఆడపడుచుల ముఖాల్లో ఆనందం*
ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్ ది*
రైతు సంక్షేమ పథకాలకు పెద్దపీట*
మిషన్ భగీరథ తో తీరిన నీటి కష్టాలు*
ఎమ్మెల్యే పంజగుల రోహిత్ రెడ్డి

సాక్షిత : చేనేత కార్మికులకు చేయూతనిచ్చి వారు తయారు చేస్తున్న 12 రకాల చీరల పంపిణీతో ఒకవైపు చేనేత కార్మికులకు చేయూత, మరొకవైపు తెలంగాణ ఆడపడుచుల ముఖాల్లో ఆనందం నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే పంజగుల రోహిత్ రెడ్డి అన్నారు.

యాలాల మండల కేంద్రంతో పాటు సంగం కుర్దు, చెన్నారం, పగిడిపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలు, పాత పెన్షన్ దారులకు కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్ కే దక్కింన్నారు. 12 రకాల చీరలు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తూన్నారన్నారు.

రైతు సంక్షేమ పథకాలకు పెద్దపీట టిఆర్ఎస్ సర్కార్ వేసిందన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీరాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు.

పల్లెల రూపురేకలు పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మార్చి పట్టణాలకు దీటుగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచ్ సిద్రాల సులోచన, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మణ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, పంచాయతీ కార్యదర్శి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS