నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ మరియు ప్రధానోపాధ్యాయుడు మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ . విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌కు సంబంధించిన తయారుచేసిన పరికరాలను పరిశీలించారు. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన వారికి పారితో షకాలను అందజేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థులతో విద్య వైజ్ఞానిక ప్రదర్శనచేయించిన ఉపాధ్యాయులను & అగస్త్య ఫౌండేషన్ వారిని అభినందించారు.విద్యార్థులను ప్రశంసిస్తూ వారు ఇంకా పై స్థాయికి వెళ్ళి నిజాంపేట్ పాఠశాల ప్రతిష్ఠను నిలపాలని అభినందించారు.ఇలాంటి సందర్భాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డి, రవి కిరణ్, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, ఎన్ ఎమ్ సి బిసి సెల్ ఉపాధ్యక్షుడు సాయి ముదిరాజ్,14 వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు బోబ్బా శ్రీనివాస్, అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు త్రివేణి, మాచం లింగం, విద్యార్థి ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు
నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…