SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి ,నిజాంపేట్ రాజీవ్ గృహ కల్ప ,ప్రగతి నగర్ మరియు షాపూర్ నగర్ లో వైస్సార్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడుకి పూలమాల వేసి ఘన నివాళిలు అర్పించించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం తాను మాట్లాడుతూ జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాదధించి 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్.. రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 (అంబులెన్స్ సర్వీసులు), ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,యువజన నాయకులు ,కాంగ్రెస్ సేవాదల్ మరియు NSUI నాయకుల పాల్గొన్నారు


SAKSHITHA NEWS