స్పందన పిటీషనర్లకు చట్ట పరిధిలో పరిష్కారం చూపండి

Spread the love

స్పందన పిటీషనర్లకు చట్ట పరిధిలో పరిష్కారం చూపండి

— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 75 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన పిటీషనర్లు తమ బాధలు, సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకున్నారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి సమగ్రంగా విన్నారు. రస్తా వివాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, తదితర సమస్యలపై పిటీషన్లు అందజేశారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page