పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
*
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్* పరిధిలోగల రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ పనులను జెండా ఊపి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి డివిజన్ లో పని చేస్తున్న ర్యాంకొ కార్మికులతో వారికి దిశానిర్దేశం చేస్తూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, కాలనీలో, బస్తీలలో ప్రతి ఒక్కరు వారి ఇంటిలోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసేవిధంగా చర్యలు చేపట్టాలని, రెండు మూడు బ్లాక్ లకు ఒక వెహికల్ ఒక జెసిపి పెట్టి కాలనీలో చెత్తాచెదారం లేకుండా పనులు చేయించాలని ర్యాంకొ వారికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదేశించడం జరిగింది. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, కనుక సినజల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. స్థానిక వాసులందరూ వారి వారి ఇంటిలోని చెత్తను తడి పొడి చెత్త వేరువేరుగా చేస్తూ జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోలో మాత్రమే వేయాలని కాలనీవాసులకు కార్పొరేటర్ సూచించారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. జిహెచ్ఎంసి వారు ఏర్పాటుచేసిన స్వచ్ఛ ఆటోల వారితో సమిష్టిగా పనిచేసి డివిజన్ లోని కాలోనీలు, బస్తీలు స్వచ్ఛందంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. ర్యాంకో వారు బస్తీలలో, కాలునీలో చెత్తను నిర్లక్ష్యం చేయకుండా, ఆ ప్రాంతవాసులతో సవినియంగా మెదులుతూ చెత్తను సేకరించాలని, పారిశుధ్య పనుల విషయంలో ప్రజల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రావాలని ర్యాంకొ వారికి కార్పొరేటర్ సూచించారు. ఈ పరిశుద్ధ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి AMOH డాక్టర్ నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్వైజర్ జలంధర్ రెడ్డి, కొండల్ రెడ్డి, రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, బసవయ్య, శ్రీనివాస్, బసవరాజ్ లింగాయత్, వెంకటేశ్వర్లు, రవీందర్, చంద్రకళ, రజిని, కుమారి, సుధారాణి, యోగి, రోజా, కళ్యాణి, జయ, మల్కయ్య, కన్నా, SRP బాల్ రాజ్, ఎస్ఎఫ్ఐ శివ, స్థానిక వాసులు ర్యాంకొ పరిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.