కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

Spread the love

కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

-చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు

  • ధ్వంసం చేసినా పేదల ఆకలి తీరుస్తున్న చంద్రబాబు
  • వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న బలమైన నేతలు
  • వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన శిష్ట్లా లోహిత్

……..
.

సాక్షిత కుప్పం, చిత్తూరు జిల్లా : మూడు రోజుల కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. అడుగడుగునా మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారని ఆయన తెలిపారు. చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత కురుస్తున్న చినుకుల వర్షంలో నేను సైతం తోడుగా అంటూ ఆయనకు శిష్ట్లా లోహిత్ గొడుగు పట్టారు. చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ గత 33 ఏళ్ళుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన కుప్పం పర్యటనలో వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశాయన్నారు. కుప్పం మోడల్ కాలనీలో 650 ఇళ్ళను నిర్మించి, ఆ కాలనీని చంద్రబాబు ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. చంద్రబాబు పాలనలో రౌడీమూకల దాడులు జరగలేదని చెప్పారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడం దారుణమన్నారు. టీడీపీ ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా చింపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారన్నారు. అన్నా క్యాంటీన్ ను టీడీపీ శ్రేణులు పునర్నిర్మించాయని, దీంతో చంద్రబాబులో మరింత ఉత్సాహం కన్పించిందన్నారు. అన్నా క్యాంటీన్లోకి చంద్రబాబు స్వయంగా వెళ్ళి పేదలకు భోజనం వడ్డించారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి కుప్పం ఘటనలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గంలో అల్లరి మూకల నుండి రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజా సంగ్రామంలో చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చంద్రబాబుకు తోడుగా నిలుస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకులను బరిలోకి దించుతానని కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని శిష్ట్లా లోహిత్ పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page