అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్
…
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు 1303 మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో వున్నాయని రానున్న అక్టోబర్ మాసంలోపు పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి వివరించారు. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరే న్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాదాన్యతా భవనాల పురోగతిపై సమిక్షించారు. జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ , జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకర నారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ప్రభుత్వ ప్రాదాన్యతా భవనాలయిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , విలేజ్ హెల్త్ క్లినిక్స్ రానున్న అక్టోబర్ మాసానికి పూర్తిచేయనున్నామని తెలిపారు. జిల్లాలో మంజూరుకాబడిన 484 సచివాలయ భవనాలకు గానూ 286 , 434 రైతుబరోసా కేంద్రాలకు గానూ 182, విలేజ్ హెల్త్ క్లినిక్స్ 385 గానూ 110 పూర్తి అయ్యాయని వివరించారు. మరో రెండు మాసాల్లో పూర్తి కావడానికి లక్ష్యాలు నిర్దేశించి వేగవంతం చేస్తామని వివరించారు. ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ దశల వారి నిర్మాణాల బిల్లులు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని , మరో వారంలోపు పెండింగ్ లేకుండా బిల్లులు జమకానున్నాయని వివరించారు. అలాగే మాసపు లక్ష్యాలు నిర్దేశించి ఖర్చు కాగల మొత్తం కూడా తెలుపగలిగితే నిధులు విడుదల ఆలస్యం లేకుండా మంజూరుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.