SAKSHITHA NEWS

పోతారంలో అంబలిని ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి సాల్కమ్ మల్లేశం యాదవ్

దుబ్బాక 29 ఏప్రిల్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాల్కమ్ మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రాగి జావా అంబలి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
అంబలిని రోజూ తాగితే మ‌న శరీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ప్రజలకు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి యేటా అంబలి తో గ్రామ ప్రజలకు దాహర్తిని తీరుస్తున్నాడని సంగారెడ్డి లో ఉన్న సొంత గ్రామానికి సేవ చేయాలని ఉద్దేశ్యంతో ఇలాంటి సేవ కార్యక్రమంలో చేయడం గొప్ప విషయము అని సాల్కమ్ మల్లేశం యాదవ్ అభినందిస్తున్నాని అన్నారు. సాల్కమ్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం లక్ష్యముగా ఉన్నాను అని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని అన్నారు. మీ ఆశీస్సులుతోనే నేను ఇంత ఏదుగుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవి,పి ఏ సి ఎస్ వైస్ చేర్మెన్ కాల్వ నరేష్,జిల్లా నాయకులు ఆనంతుల శ్రీనివాస్, సినియార్ నాయకులు కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 29 at 8.43.47 PM

SAKSHITHA NEWS