ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ నేతలు తమకు ప్రలోభాలు పెట్టారంటూ వైసీపీ సంచలన ఆరోపణలు.
ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ నేతలు తమకు ప్రలోభాలు పెట్టారంటూ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. YCP నేత రాజేంద్రనాథ్‌తో కోవూరు TDP అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మాట్లాడిన ప్రలోభాల ఆడియోను బయటపెట్టారు వైసీపీ నేతలు. ఇక కోవూరు టీడీపీ MLA అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రలోభపెట్టారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.
అయితే తన అన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తాను వ్యతిరేకమని భావించి, ఫిబ్రవరి 16న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనకు ఫోన్ చేశారన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఒకవేళ కొవ్వూరులో పోటీ చేస్తే మద్దతు కోసమే ఆమె ఫోన్ చేశారన్నారు. నెల్లూరు ప్రజలు వేమిరెడ్డి కుట్రలను అర్థం చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఓడిపోతే వెళ్లిపోతామనే వారు కావాలా లేక, ప్రజలకు అందుబాటులో ఉండే తాము కావాలా అని విజయసాయి ప్రశ్నించారు.
ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో దూసుకుపోతుండగా, టీడీపీ ప్రజాగళం పేరుతో ప్రచారం పర్వం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకుల విమర్శలు నిబంధనలకు మించి ఉండటంతో ఈసీ నోటిసులు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఎన్నికలను ఏపీలో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటమే కారణం.